బహుముఖ దార్శనికుడు – బహుజన తాత్త్వికుడు పోతులూరి వీరబ్రహ్మం
₹40.00
పేజీలు : 48 డా|| ఎం.ఎం. వినోదిని గారు తెలుగు విశ్వవిద్యాలయం, రాజమండ్రి సాహిత్య పీఠంలో ఎం.ఎ. తెలుగు చదివారు. అక్కడే ఆచార్య ఎండ్లూరి సుధాకర్‌గారి పర్యవేక్షణలో స్త్రీవాద కవిత్వం మీద పిహెచ్.డి చేశారు. తన సిద్ధాంత గ్రంథాన్ని ”స్త్రీ వాద కవిత్వం – భాష వస్తురూప నవ్యత” పేరుతో ప్రచురించారు. స్వచ్ఛందంగా సామాజిక రంగంలో కొంతకాలం పనిచేసి యోగివేమన విశ్వవిద్యాలయంలో తెలుగు శాఖలో అధ్యాపకులుగా చేరి పనిచేస్తున్నారు. అంబేద్కరీయ, స్త్రీవాద దృక్పథంతో కథలు, విమర్శ రాస్తున్నారు. అన్నమయ్య, వేమన, వీరబ్రహ్మంల మీద సామాజిక దృక్పథంతో విమర్శ రాసి ”వేగుచుక్కలు” పేరుతో ప్రచురించారు. వినోదిని గారు రాసిన కథలు ”బ్లాక్ ఇంక్” పేరుతో వచ్చాయి. కొన్ని కవితలు, దాహం వంటి నాటికలు రచించారు. ఈమె రచనలు కొన్ని పాఠ్యాంశాలుగా బోధింపబడుతున్నాయి. గుంటూరులో పుట్టి, రాజమండ్రిలో చదువుకొని, ఖమ్మం జిల్లాలో ఖాజాను పెళ్ళి చేసుకొని, కడపలో అధ్యాపకత్వం నిర్వహిస్తున్న వినోదినిగారు తెలుగు నేల నలుచెరగులా సంచరించారు. మానవ హక్కులు, దళిత, స్త్రీల హక్కులు వంటి వాటి గురించి జాతీయ అంతర్జాతీయ సదస్సులలో పాల్గొని ప్రసంగించారు. వ్యాసాలు రాశారు. లౌకిక భారతదేశ నిర్మాణం వినోదిని గారి స్వప్నం. విద్యాసంస్థలలో పాఠ్యాంశ నిర్ణయంలో జరిగే లోపాలను ఎత్తిచూపుతుంటారు. – ఆచార్య రాచపాళెం
Reviews
There are no reviews yet.