నేను మలాలా
₹350.00
పేజీలు : 320
మలాలా మనలను స్వాత్ వాలికి తీసుకునిపోయింది. అక్కడి పిల్ల తెమ్మరలు మనలను పులకింపజేస్తాయి. నునువెచ్చటి సూర్యకిరణాలు మనలను పరవశింపచేస్తాయి. అందమైన ఆ పకృతితో పాటు వికృతమయిన తాలిబాన్ల ఘాతుకాలనూ మనకు కళ్ళకు కట్టేంత సునిశితంగా చిత్రించింది. మత మౌఢ్యానికి మానవత్వానికి ఎంత దూరమో మనం ఈ ఆత్మకథలో చూస్తాం. స్వేచ్ఛ మనిషిని మనిషిగా నిలబెడుతుంది. మతమౌఢ్యం మనిషిలోని మానవత్వాన్ని సమూలంగా చెరిపేస్తుంది. కాదు చిదిమి వేస్తుంది. మనిషి వికాసానికి తోడ్పడే, ప్రశ్నించేతత్వాన్నే సమాధిచేస్తుంది. సృజనాత్మకతని ధ్వంసం చేస్తుంది. సాంస్కృత వికాసం సమాధవుతుంది. అందాల స్వాత్ లోయ, మతమౌఢ్యులయిన తాలిబన్లు చెరలోపడి విలవిలలాడింది.
Reviews
There are no reviews yet.