ప్రపంచ కమ్యూనిస్టు ఉద్యమం దాని పరిణామం
₹480.00
పేజీలు : 487
ఈ గ్రంథ రచయితలైన కామ్రేడ్స్ చండ్రపుల్లారెడ్డి, మానికొండ సుబ్బారావులు 1847లో కమ్యూనిస్టు లీగు ఏర్పడిన నాటి నుండి 1964 దాకా అంటే వంద సంవత్సరాల పాటు కమ్యూనిస్టు ఉద్యమంలో సంభవించిన పరిణామాల్ని మన ముందుంచారు. మార్క్స్, ఎంగెల్సులు ఎదుర్కొన్న తప్పుడు ధోరణుల్ని ఈ గ్రంథంలో అందరికీ సులభంగా అర్థమయ్యే రీతిలో పరిచయం చేశారు. ఛార్టిస్టు ఉద్యమం, ఫ్రాన్స్‌లో అంతర్యుద్ధం, పారిస్ కమ్యూన్ లాంటి కార్మికవర్గ ఉద్యమాలు, కార్మిక విప్లవాలు అందించిన ముఖ్యమైన పాఠాలు మనకు అందించారు. భారత కమ్యూనిస్టు ఉద్యమంలోనూ విప్లవకారుల్లోనూ, మేధావుల్లోనూ తలెత్తుతున్న అనేక రకాల తప్పుడు ధోరణుల నుండి బయటపడటానికి ఈ గ్రంథపు అధ్యయనం ఎంతగానో తోడ్పడుతుంది.
Reviews
There are no reviews yet.