మావో రచనలు
₹450.00
పేజీలు : 458
మార్క్సిజాన్ని నిర్దిష్ట పరిస్థితులకు నిర్దిష్టంగా అన్వయించుకోవడం ద్వారానే దాన్ని సృజనాత్మకంగా ముందుకు తీసుకుపోగలం. విప్లవాన్ని సాధించగలం. అలాంటి ప్రయత్నం తొలుత రష్యాలో లెనిన్ నాయకత్వాన జరిగింది. మహత్తర అక్టోబర్ మహావిప్లవం విజయవంతం అయింది. ఆ తర్వాత వ్యవసాయక దేశÄమైన చైనా కమ్యూనిస్టు పార్టీ మార్క్సిజాన్ని చైనా నిర్దిష్ట పరిస్థితులకు అన్వయించుకోవడం ద్వారా జనతా ప్రజాతంత్ర విప్లవాన్ని సాధించింది. చైనా కమ్యూనిస్టుపార్టీ అగ్రనేత మావో సే టుంగ్. ఆయన విప్లవోద్యమ కాలంలో అనేక రచనలు చేశారు. విప్లవానంతరం నవచైనా పునర్నిర్మాణం గురించి ఎన్నో రచనలు చేశారు. ఆ రచనలనన్నింటిని బీజింగ్ విదేశీ భాషా ప్రచురణల సంస్థ ఆంగ్లంలో పలు సంపుటాలుగా వెలువరించింది. అదే సంస్థ వాటిలోని ప్రధానమైన రచనలను ఎంపిక చేసి ‘సెలెక్టెడ్ రీడింగ్స్ ఫ్రం ది వర్క్స్ ఆఫ్ మావో సే టుంగ్’ అనే పేరుతో 1971లో ఒకే సంపుటంగా వెలువరించింది. ఇప్పుడు మీ ముందున్న గ్రంథం దానికే అనువాదం.
Reviews
There are no reviews yet.