సాహిత్య విమర్శ
₹200.00
పేజీలు : 240
సాహిత్య శాస్త్రం వేరు, సాహిత్య విమర్శ శాస్త్రం వేరు. అయితే మొన్నమొన్నటి దాకా మనం అలంకారశాస్త్రాన్నే విమర్శ శాస్త్రంగా భావిస్తూ వచ్చాం. సాహిత్య శాస్త్రం సాహిత్యం ఎలా ఉండాలో చెబుతుంది. సాహిత్య విమర్శ శాస్త్రం సాహిత్య విమర్శ ఎలా ఉండాలో చెబుతుంది. మనకు విమర్శ శాస్త్రం అన్నది ప్రత్యేకంగా రూపొందక పోవడంవల్ల సాహిత్య శాస్త్రాన్నే విమర్శకు కూడా ఉపయోగించుకుంటూ వచ్చాం. సాహిత్య విమర్శ గురించి ఈ వ్యాసాలు రాసిన విద్వాంసులందరూ ఒకే జాతికి చెందిన వాళ్ళుకారు. సమాజంలో ఉండే భావవైవిధ్యం, భావ వైరుధ్యం వీళ్ళలోనూ కనిపిస్తుంది. సంప్రదాయ, ఆధునిక భావజాలాల సంఘర్షణ వీళ్ళలో కనిపిస్తుంది.
Reviews
There are no reviews yet.