మేం కమ్యూనిస్టులం ఎలా అయ్యాం
₹50.00
పేజీలు : 64
‘ఏ జాతి చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం, నరజాతి చరిత్ర సమస్తం పరపీడన పరాయణత్వం’ అన్నాడు మహాకవి శ్రీశ్రీ. అటువంటి పరపీడనను ప్రతిఘటించి పోరాడిన వారే చరిత్ర సృష్టించిన వీరులు. మట్టిలోనుండి మాణిక్యాలను తయారు చేసినట్లు భారత దేశంలో రైతులు, కూలీలు, కార్మికులు, గిరిజనులు, దళితులు.. ఒకరేమిటి సమస్త శ్రామిక జనపోరాటాలనుండి గొప్ప యోధులను సృష్టించింది, నేటికీ సృష్టిస్తోంది కమ్యూనిస్టు పార్టీ. మన రాష్ట్రంలోనూ ఆ విధంగా స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొన్న అనేక మంది కాంగ్రెస్ వాదులూ, ఇతరులూ కమ్యూనిస్టు పార్టీ పేద ప్రజలకోసం పనిచేసే తీరునూ, నాయకుల క్రమశిక్షణనూ దాని సిద్ధాంతాన్నీ చూసి పార్టీలోకి వచ్చారు. వారిలో కొందరు ముఖ్యులు తాము కమ్యూనిస్టు పార్టీలోకి ఎలా వచ్చిందీ తెలుపుతూ రాసిన వ్యాసాలతో 1946లో అప్పటి ప్రజాశక్తి బుకహేౌస్ ముక్కామల నాగభూషణం గారి సంపాదకత్వంలో ఒక పుస్తకాన్ని ప్రచురించింది. ప్రస్తుత పరిస్థితుల్లో ఈ పుస్తక అవసరాన్ని గుర్తించి ‘మేము కమ్యూనిస్టులం ఎలా అయ్యాం’ అనే శీర్షికతో తీసుకొస్తున్నాం.
Reviews
There are no reviews yet.