విద్య ప్రయివేటీకరణ, కాషాయీకరణకే నూతన విద్యావిధానం
₹40.00
పేజీలు : 48
బిజెపి ప్రభుత్వం ప్రకటించిన నూతన విద్యా విధానం పూర్తిగా తిరోగమన దిశలో ఉంది. సమ సమాజానికి పునాది వేయవలసిన విద్యా విధాన మౌలిక లక్ష్యం నుంచి వెనకడుగు వేయడమే ఈ నూతన విద్యా విధాన (ఎన్‌ఇపి) సారాంశం. సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన తరగతులను విద్యా రంగానికి దూరం చేయడం ఈ నూతన విధానంలో కనపడే పెద్ద వెనకడుగు. ఈ సామాజికంగా వెనకబడిన తరగతుల రక్షణ కోసం రూపొందిన రిజర్వేషన్లు వంటి గ్యారంటీ చర్యల గురించిన ప్రస్తావన ఏదీ ఈ విధాన పత్రంలో మనకు కనిపించదు. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం నేరుగా నిర్వహించే జెఎన్‌యు వంటి విశ్వవిద్యాలయాల్లో రిజర్వేషన్లను అమలు జరపకుండా ప్రభుత్వమే నీరుగారుస్తున్న తీరు గమనిస్తే ఈ విధాన పత్రంలో దళిత, ఒబిసి తరగతుల విద్యార్ధులను విద్యారంగం నుంచి పక్కకు నెట్టివేసే ధోరణి వెనుక ప్రభుత్వ పాత్ర స్పష్టంగా కానవస్తుంది.
Reviews
There are no reviews yet.