పాబ్లో నెరుడా జీవితం – కవిత్వం
₹50.00
పేజీలు : 72
ఆఖరు క్షణం వరకూ తనను వేటాడిన సామ్రాజ్యవాదులు కూడా అంగీకరించక తప్పని అత్యున్నత విశ్వ విప్లవ కవితా శిఖరం పాబ్లో నెరుడా. కొన్ని తరాలుగా ఆయన పేరు వినని నిజమైన సాహితీ ప్రియులు గాని, ప్రగతిశీల వాదులు గాని వుండరంటే అతిశయోక్తి కాదు. ఇప్పటికీి విశ్వ సాహితీ వీధుల్లో అత్యంత ప్రసిద్ధుడు ఆయనే. కేవలం కవిగానే గాక శాంతి యోధుడుగా సామ్యవాద మేధావిగా కమ్యూనిస్టు నేతగా దౌత్యవేత్తగా, ప్రజా ప్రతినిధిగా, సామ్రాజ్యవాదంపైనా చిలీ సైనిక నియంతృత్వంపైన కడదాకా పోరాడిన యోధుడుగా నెరుడాతో పోల్చదగిన మహావ్యక్తులు చాలా అరుదు. భాషాంతరీకరణలోనైనా భావ బలంతో కదం తొక్కించే కవిత్వం ఆయనది. దేశ దేశాల మహాకవులకే ప్రేరణగా నిలిచిన వైతాళిక పాత్ర పాబ్లో నెరుడాది. నవ భావాలకు నిరంతర స్పూర్తి ప్రదాత నెరుడా కవిత్వం జీవితం గురించి ఒక రేఖామాత్ర చిత్రణ, ప్రముఖులు అనువదించిన కొన్ని కవితల పునర్ముద్రణ ఈ చిన్న పుస్తకం.
Reviews
There are no reviews yet.