భారత జాతీయోద్యమం విశ్లేషణాత్మక వ్యాసాలు
₹100.00
పేజీలు : 112
సామ్రాజ్యవాద వ్యతిరేక వైఖరిపై, బూర్జువా వర్గం తన నిబద్ధత కోల్పోయింది. సామ్రాజ్యవాద వ్యతిరేక పోరాటం మందగించింది. ఈ సమయంలో కార్మికవర్గ నాయకత్వం క్రింద నూతన ప్రజావుద్యమ వెల్లువ రావలసి వుంది. అయితే, అంతకుముందే, మతతత్వ, వేర్పాటువాద, మితవాద శక్తులు రంగప్రవేశం చేసి ప్రజల మధ్య విద్వేషాలను రెచ్చగొట్టాయి. సామ్రాజ్యవాద వ్యతిరేక పంథాను పూర్తిగా విడనాడిన బూర్జువా వర్గానికి, ప్రభుత్వ యంత్రాంగాన్ని కంట్రోలు చేసే మార్గం అవసరమైంది. ఆ మార్గమే మతోన్మాదం. నిస్సహాయులైన మైనారిటీ గ్రూపులను ‘శత్రువు’గా ఎన్నుకొని, తనచుట్టూ ప్రజాసమీకరణ చేసింది. అలాంటి వుద్యమాల వెనుక సామ్రాజ్యవాదుల హస్తం తప్పకుండా వుంటుంది. వారి ఆశీర్వాదాలుంటాయి. అయితే, మతతత్వ గూండాల అధికారం వుండాలని సామ్రాజ్యవాదులు కోరుకుంటారని కాదు. కాని, సమాజం కొంతమేరకు మతతత్వ చాందసత్వంతో వుండడం వారికి అవసరం. అలాంటి రాజకీయ వాతావరణం, పరిస్థితి వారికి సరైందిగా వుంటుంది.
Reviews
There are no reviews yet.