సామాన్యులకు మాటలు సంపన్నులకు మూటలు
₹50.00
పేజీలు : 96
బిజెపి ప్రభుత్వం మూడు విధాలుగా తన ప్రజావ్యతిరేక విధానాలను అతివేగంగా కొనసాగిస్తున్నది. ఒకటి, మతోన్మాద హిందూత్వ విధానాలను తీవ్రంగా ముందుకు తీసుకువెళుతూ సమాజంలో మత విభజనలను రెచ్చగొడుతున్నది. రెండు, దేశ, విదేశీ బడా కార్పొరేట్ సంస్థలకు విపరీతమైన ప్రయోజనాలు కలుగచేసే విధంగా నయా ఉదారవాద ఆర్ధిక విధానాలను బరితెగించి అనుసరిస్తున్నది. మూడు, ప్రజాస్వామిక సంస్థలను, ప్రక్రియలను నేలరాస్తూ నియంతృత్వ ప్రమాదాన్ని దగ్గర చేస్తున్నది. సిపిఐ (ఎం) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి చెప్పినట్లు ఇది ఒక వినాశకరమైన త్రిశూలం. ఈ ప్రమాద తీవ్రతను గుర్తించి ఎదుర్కోవలసిన బాధ్యత ప్రజాస్వామ్య, ప్రజానుకూల శక్తులన్నింటిపైన ఉంది. వామపక్ష అనుకూల పాత్రికేయునిగా పేరుగాంచిన వి. హనుమంతరావు రాసిన ఈ ఆర్థిక వ్యాసాలు ఈ అవసరానికి ఎంతగానో ఉపయోగపడతాయి.
Reviews
There are no reviews yet.