కాళికాంబా సప్తశతి
₹100.00
పేజీలు : 128
మతము మత్తుగూర్చు మార్గమ్ము కారాదు హితముగూర్పవలయు నెల్లరకును హితము గూర్పలేని మతము మానగవలె కాళికాంబ !హంస! కాళికాంబ! వెలదులకును వేదవిద్యాధికారమ్ము లేదటంచు, బ్రహ్మలిఖితమంచు నోరుతెరచి మరచినారు వాణిని నిన్ను కాళికాంబ!హంస!కాళికాంబ! సర్వమానవులను సమముగా ప్రేమించు కులమతాలనెంచి కోపపడకు కాపుజాతినెల్ల కరుణించుమనె శ్రుతుల్ కాళికాంబ!హంస!కాళికాంబ! తీండ్రమైన కవిత గండ్రగొడ్డలిగాగ బాటనడ్డు శత్రుకోటి గొట్టి వరకవీశు డచలబ్రహ్మమ్ము తానౌను కాళికాంబ!హంస!కాళికాంబ!
Reviews
There are no reviews yet.