విజ్ఞాన ప్రజ్వలిత మేరీ క్యూరీ
₹40.00
పేజీలు : 70
విజ్ఞాన మేధోఖని మేరీక్యూరీ అత్యంత తెలివిగల విద్యార్థినిగా భాసిల్లింది. ఆమె ఆనాడు ఒక బానిస దేశంగా ఉన్న పోలండ్‌లో జన్మించింది. ఆమె పేద కుటుంబంలో తల్లిదండ్రుల ముద్దుబిడ్డగా పెరిగింది. మేరీ చిన్ననాటి నుంచే పేదరికంతోనూ, ఒంటరి జీవితంతోనూ సహజీవనం చేసింది. తదనంతరకాలంలో తనలాంటి ఒక విజ్ఞానినే వివాహమాడింది. వారి జీవితం అసామాన్యమైనది. నిరంతరం ఇద్దరూ పరిశోధనల్లో మునిగితేలి, చివరకు అత్యంత అద్భుతమైన ‘రేడియం’ను కనుగొన్నారు. ఈ ఆవిష్కరణ ఒక నూతన వైజ్ఞానిక అధ్యాయానికి తెరలేపింది. ప్రపంచంలోనే అత్యంత భయంకరమైన వ్యాధిగా పరిగణింపబడిన క్యాన్సర్‌కు ఒక చక్కటి చికిత్సా విధానాన్ని కూడా అందించింది. ఇది ఆ దంపతులు మానవజాతికి సమర్పించిన గొప్ప వరప్రసాదమని చెప్పవచ్చు. మేరీక్యూరీ విజ్ఞానవేత్తగా ఎన్నో ఘన విజయాలు సాధించింది. భౌతికశాస్త్రంలో ఆమె తన భర్తతోపాటు ‘నోబెల్ పురస్కారం’ అందుకున్నది. నోబెల్ బహుమతి పొందిన మొట్టమొదటి మహిళ మేరీ క్యూరీయే! ఇదేగాక రెండోసారి రసాయన శాస్త్రంలో నోబెల్ పురస్కారం పొంది చరిత్రలోనే రెండుసార్లు ఆ పురస్కారాన్ని పొందిన మహిళా శాస్త్రవేత్తగా కూడా ఆమే నిలిచింది!
Out of stock
Reviews
There are no reviews yet.