సోషలిజం: ఊహాజనితం శాస్త్రీయం
₹80.00
పేజీల :96
కార్మిక వర్గం రాజ్యాధికారాన్ని స్వాధీనం చేసుకొని, తద్వారా పెట్టుబడిదారుల చేతుల్లో నుంచి జారిపోతున్న సామాజిక ఉత్పత్తి సాధనాలను యావత్తు సమాజపు ఆస్తిగా మార్చివేస్తుంది. ఈ చర్య ద్వారా కార్మికవర్గం ఉత్పత్తి సాధనాలన్నిటినీ వాటి పెట్టుబడిదారీ స్వభావం నుంచి విముక్తి చేసి, వాటి సామాజిక స్వభావం సంపూర్ణంగా వికసించేటందుకు స్వేచ్ఛను కల్పిస్తుంది. ఇకమీదట సామాజికోత్పత్తి ఒక నిర్దిష్టమైన పథకం ప్రకారం కొనసాగగలదు. ఉత్పత్తి నిరాటంకంగా అభివృద్ధి చెందితే సమాజంలో వర్గాలుండవలసిన అవసరానికి కాలదోషం పడుతుంది. సామాజికోత్పత్తిలో అరాచకం ఏమేరకు సమసిపోతుందో, ఆమేరకు రాజ్యం యొక్క రాజకీయ అధికారం నశిస్తుంది. చివరకు మానవుడు తాను నిర్మించిన సామాజిక వ్యవస్థకు తానే అధినాథుడిగా వుంటూ, తనపై ఆధిపత్యం వహిస్తున్న ప్రకృతిపైనా, స్వయంగా తనపైన తాను అధినాథుడవుతాడు. అంటే సంపూర్ణ స్వేచ్ఛగల మానవుడవుతాడు.
Reviews
There are no reviews yet.