ఏది అసలైన హరిత విప్లవం?

150.00

పేజీలు : 200
పెరుగుతూ పోతున్న జనాభాకు తగినంత ఆహారం ఉత్పత్తి కావటం అసంభవమని సూత్రీకరించిన మాల్దస్‌ వంటి 18వ శతాబ్ద శాస్త్రవేత్తల్ని వెనక్కినెట్టి, వ్యవసాయ రంగ అభివృద్ధి ద్వారా తగినంత ఆహారలబ్ధి సాధ్యమని 20వ శతాబ్ద శాస్త్ర-సాంకేతికాలు నిరూపించాయి. అధిక జనాభా గల భారతదేశం వంటివి కూడా చాలావరకు ఆహార కొరత నుండి బయట పడగలిగాయి. 2013 నాటికి దేశం ”ఆహార భద్రతా చట్టం” స్థాయికి చేరటమే దానికి నిదర్శనం. కాని అభివృద్ధి చేయబడిన ఈ వ్యవసాయరంగమే నేడు సంక్షోభాన్ని ముందుకు తెచ్చింది. సమాజంలోని సింహభాగాన్ని యిముడ్చుకున్న ఈ రంగం, నేడొక కీలక మలుపులోకి నెట్టబడ్డది. ఆహార ఉత్పత్తిదారులను ”మాకొద్దీ నష్టకరమైన వృత్తి” అనే స్థితికి తెచ్చింది. సమాంతరంగా వాతావరణ మార్పులకు, పర్యావరణ పతనానికి ఈ వ్యవసాయరంగం కూడా కారణమనే స్థితి వచ్చింది.

Reviews

There are no reviews yet.

Be the first to review “ఏది అసలైన హరిత విప్లవం?”

Your email address will not be published. Required fields are marked *