చె
₹60.00
పేజీలు : 72
మనం, సోషలిస్టులం, మరింత స్వేచ్ఛ అనుభవిస్తున్నాం, ఎందుకంటే మనం మన కర్తవ్య నిర్వహణలో మరింత సంతృప్తి చెందుతున్నాం ఎందుకంటే మనం మరింత స్వేచ్ఛ అనుభవిస్తున్నాం గనుక. మన పూర్తి స్వేచ్ఛకు సంబంధించిన చట్రం ఇప్పటికే తయారైంది. రక్త మాంసాలు, దుస్తులు రూపొందించాలి. వాటిని మనం సృష్టిస్తున్నాం. రక్తంతోనూ, త్యాగాలతోనూ మనకు స్వేచ్ఛ వచ్చింది, ప్రతిరోజూ నిలబడుతోంది. మన త్యాగం చైతన్యపూరితమైనది. మనం నిర్మించే స్వేచ్ఛా ప్రపంచానికి చెల్లిస్తున్న ఇన్స్టాల్మెంట్ అది. మార్గం సుదీర్ఘమైనది. కొంత భాగం ఎలా ఉంటుందో మనకు తెలియదు. మన పరిమితులు మనకు తెలుసు. మనం 21వ శతాబ్దపు మానవులను, అంటే మనల్ని మనం తయారు చేసుకుంటాం. మనం కొత్త సాంకేతిక శాస్త్రంతో కొత్త మానవుణ్ణి, కొత్త స్త్రీ,పురుషుణ్ణి తయారు చేయడానికి రోజువారీగా కృషి చేస్తాం. ప్రజలను సమీకరించి, నాయకత్వం వహించడంలో వ్యక్తుల పాత్ర ఉంటుంది. ప్రజల అత్యున్నత లక్షణాలను, ఆకాంక్షలను ఇముడ్చుకున్నవారు, ఎంచుకున్న మార్గాన్ని విడనాడనివారు అటువంటి పాత్ర నిర్వహించ గలుగుతారు. మార్గాన్ని సుగమం చేసేది మాత్రం పార్టీ. పార్టీ అంటే అగ్రగామి దళం, మంచివాళ్లలో ఉత్తమోత్తమమైన వాళ్లతో కూడినది. మన కృషికి మౌలికమైన పదార్ధం యువతరం. మనం దానిపై ఆశలు పెట్టుకుంటాం. మన తరువాత పతాకాన్ని చేబూనడానికి వారిని సిద్ధం చేస్తాం.
– ఎర్నెస్టో చె గువేరా
Reviews
There are no reviews yet.