రక్తాక్షరాలు
₹75.00
పేజీలు : 104
ద్వితీయ ప్రపంచ యుద్ధ సమయంలో జెకోస్లొవేకియాకు చెందిన కమ్యూనిస్టు పాత్రికేయుడు జూలియస్ ఫ్యూజిక్ నాజీ కాన్సంట్రేషన్ క్యాంప్‌లో ఎదుర్కొన్న భయంకర అనుభవాలకు అక్షర రూపం ఇది. దారుణమైన చిత్రహింసలను భరిస్తూ, మరణానికి అంచున ఉంటూ సైతం ఆయన తోటి ఖైదీలలో ఆత్మవిశ్వాసాన్ని నింపడానికి ఎలా ప్రయత్నించాడో తెలుపుతుంది ఈ రచన. ఒక జెక్గార్డ్ అందించిన పేపర్లు, పెన్సిల్ సాయంతో అతి రహస్యంగా జైల్లో రాసిన ఈ రచనలు అంతే రహస్యంగా పలువురు మిత్రుల ద్వారా బయటికి చేరాయి. చివరకు ఫ్యూజిక్ను నాజీలు 1943 సెప్టెంబరు 8న బెర్లిన్‌లో ఉరితీశారు. యుద్ధానంతరం ఫ్యూజిక్ భార్య ఆ జైలు పేపర్లన్నింటినీ సేకరించి ప్రచురించారు. ఏడెనిమిది దశాబ్దాల క్రితమే తెలుగులోకి అనువదించబడిన ఈ గ్రంథం విశేషాదరణ పొందింది. ఆ తర్వాత పలు ముద్రణలు వెలువడ్డాయి.
Reviews
There are no reviews yet.