లౌకికతత్వం, ప్రజాస్వామ్యం, జాతీయ సమైక్యతకు ఆర్‌ఎస్‌ఎస్‌, హిందుత్వ ఫాసిస్టు ప్రమాదం

60.00

పేజీలు : 64

ఆర్‌ఎస్‌ఎస్‌ నేడు భారతదేశ సమైక్యత, సమగ్రతకూ దాని ప్రజాస్వామ్య, లౌకికలక్షణానికీ చివరికి భారత దేశ రాజ్యాంగానికే ఒక పెద్ద ప్రమాదంగా మారింది. తన విశ్చిన్నకర, ఫాసిస్టు కార్యకలాపాలతో శ్రామిక ప్రజల వర్గ ఐక్యతను విచ్ఛిన్నం చేయడం ద్వారా అది కార్పొరేట్‌ పెట్టుబడి, సామ్రాజ్యవాద శక్తుల ప్రయోజనాలు కాపాడుతున్నది.
2025లో ఆర్‌ఎస్‌ఎస్‌ శత వార్షికోత్సవ జయంతి వేడుకలు జరుపుకోనుంది. ఈ లోగా కేంద్ర ప్రభుత్వంలో వ్యవహారాలు చక్కబెడుతున్న మోడీ, షా ద్వయం సహాయంతో తమ హిందూ రాష్ట్ర స్థాపన కలను సాకారం చేసుకోవాలని ఆర్‌ఎస్‌ఎస్‌ దాని అనుబంధ సంస్థలు తహతహ లాడుతున్నాయి.
లౌకిక ప్రజాతంత్ర పునాదిపై ఏర్పడ్డ రాజ్యాంగాన్ని తుంగలో తొక్కడానికి చేస్తున్న ప్రయత్నాలు ప్రజల నుండి ప్రతిఘటన ఎదుర్కోక తప్పదు. ఆర్‌ఎస్‌ఎస్‌ సవాలును తగిన రీతిలో ఎదుర్కోవాలంటే, ఈ ఉపద్రవాన్ని కూకటివేళ్లతో పెకలించి వేయాలనుకుంటే మనం ఆర్‌ఎస్‌ఎస్‌ పనితీరును అర్థం చేసుకోవాలి. అందుకోసం ఆర్‌ఎస్‌ఎస్‌ లక్ష్యాలు, నిర్మాణం, పని విధానాలను గురించీ, వాటిని ఎదిరించి నిలవడానికి అవసరమైన ఉపకరణాలను గురించీ పర్యావలోకనం చేయాలి.

Reviews

There are no reviews yet.

Be the first to review “లౌకికతత్వం, ప్రజాస్వామ్యం, జాతీయ సమైక్యతకు ఆర్‌ఎస్‌ఎస్‌, హిందుత్వ ఫాసిస్టు ప్రమాదం”

Your email address will not be published. Required fields are marked *