ఎన్.గోపి – సాహిత్యానుశీలనం
₹110.00
పేజీలు : 160
ఎన్.గోపి కవి, విమర్శకుడు, పరిశోధకుడు, ఆచార్యుడు. ‘తంగెడుపూలు’ నుండి ‘జీవనభాష’ దాకా ఇరవైమూడు కావ్యాలు ప్రచురించారు. ‘జలగీతం’ ఆయన ఇతిహాసం. ఆయన కావ్యాలు ఇరవైమూడు భాషలలోకి అనువాదమయ్యాయి. గోపి నిరంతర కవి. చీమ నుండి హిమాలయపర్వతం దాకా ఆయన కవిత్వవస్తువులయ్యాయి. తెలంగాణ నుండి సైప్రస్ దాకా ఆయన కవిత్వం ప్రయాణించింది. సాహిత్య అకాడమీ వంటి అనేక సంస్థల పురస్కారాలు అందుకున్నారు. ఉస్మానియా తెలుగు శాఖాధ్యక్షుల నుండి తెలుగు విశ్వవిద్యాలయ ఉపాధ్యక్షుల దాకా అనేక పదవులు నిర్వహించారు. వేమనను విశ్వవిద్యాలయ మెట్లెక్కించి వేమన గోపి అయ్యారు. ‘నానీలు’ను సృష్టించి ప్రయోగాన్ని సంప్రదాయం చేశారు. సాహిత్య అకాడమీ కార్యనిర్వాహక సంఘసభ్యులుగా, తెలుగు సలహామండలి కన్వీనర్‌గా ఉన్నారు.
Reviews
There are no reviews yet.