నూతన జాతీయ విద్యా విధానం
₹20.00
పేజీలు : 32
గ్లోబలైజేషన్ ఫలితంగా పుట్టుకొచ్చిన కొత్త కొత్త పదాలతో మార్కెట్‌ను పెంచుకొనేందుకు ఎన్నో అంతస్థులు కల్గిన పాఠశాలలు/ కళాశాలలను స్థాపిస్తున్నారు. ఏదైనా పాఠశాల/కళాశాలలో ప్రవేశం కోసం వెళ్తే.. అడ్వాన్స్‌లో కావాలా? కాలేజియేట్లోనా? ఐఐటీ బ్యాచ్లోనా/ ఎంసెట్ బ్యాచ్లోనా అని నానా యాగీ చేస్తూ ప్రజల్ని తీవ్ర అయోమయానికి గురిచేస్తున్నారు. ఒక్కో బ్యాచ్‌కో ఒక్కోరకంగా ఫీజులు వసూలు చేస్తూ రూ.కోట్లకు పడగలెత్తుతున్నారు. కళాశాలలో ఎంసెట్‌కు ఇంత ఫీజు, ఐఐటీకి ఇంత ఫీజు, ఇంటర్మీడియెట్‌కు ఇంతఫీజు అని రకరకాలుగా వసూలు చేస్తూ సామాన్యుడిని పీల్చేస్తున్నారు. మనం గమనిస్తుంటే.. మరో పదేళ్లలో అన్నీ స్మార్ట్లే వస్తాయి. అందులో ఎలాంటి అనుమానం అక్కర్లేదు. ఇది మార్కెట్‌కు మరో స్వరూపంగా చెప్పుకోవచ్చు.
Reviews
There are no reviews yet.