లెనినిజం పునాదులు
₹130.00
పేజీలు : 152
అంతిమంగా లెనినిజం అంటే ఏమిటి?
లెనినిజం, సామ్రాజ్యవాద శ్రామికవర్గ విప్లవ శకానికి చెందిన మార్క్సిజం. ఇంకా సరిగ్గా చెప్పాలంటే లెనినిజం అనేది సాధరణంగా శ్రామికవర్గ విప్లవ సిద్ధాంతమూ, ఎత్తుగడలూ; ప్రత్యేకంగా శ్రామికవర్గ నియంతృత్వ సిద్ధాంతమూ, ఎత్తుగడలూను. మార్క్స్, ఎంగెల్సులు విప్లవ దశకు పూర్వపు దశలో (శ్రామిక వర్గ విప్లవానికి ముందు అనే అర్థంలో నేను వాడుతున్నాను.) తమ కార్యకలాపాలు సాగించారు. అప్పటికి అభివృద్ధి చెందిన సామ్రాజ్యవాదం ఇంకా ఏర్పడలేదు. విప్లవానికి శ్రామికులు తయారయ్యే దశలోనే వున్నారు. శ్రామికవర్గ విప్లవం తక్షణ వాస్తవిక తప్పనిసరి సంఘటనగా ముందుకు రాలేదు. అయితే మార్క్స్, ఎంగెల్సుల శిష్యుడైన లెనిన్ తన కార్యకలాపాలను అభివృద్ధి చెందిన సామ్రాజ్యవాదపు దశలో, శ్రామికవర్గ విప్లవం ప్రభవిస్తూ ఉన్న దశలో, శ్రామికవర్గ విప్లవం అప్పటికే ఒక దేశంలో జయించి బూర్జువా ప్రజాతంత్రమును భగం చేసి శ్రామికవర్గ ప్రజాతంత్ర శకాన్ని, సోవియట్ల శకాన్ని ప్రవేశపెట్టిన కాలంలో సాగించాడు.
అందువల్ల లెనినిజం అనేది మార్క్సిజం అభివృద్ధిలో తదుపరి దశ.
Reviews
There are no reviews yet.