విల్లాపురం వీరనారి లీలావతి
₹30.00
పేజీలు : 40
ప్రజాసేవే తన జీవిత ధ్యేయంగా మలుచుకుని దాని కొరకు తన ప్రాణాన్ని బలిదానం గావించిన వీరనారి లీలావతి. సంఘ విద్రోహుల కరకు కరవాలాలకు బలయిన ఆమె త్యాగం వేనోళ్ల కొనియాడ దగింది. సాటిలేనిది. చేనేత కార్మికురాలిగా తన జీవితాన్ని ప్రారంభించిన లీలావతి మార్క్సిస్టు సిద్ధాంతానికి ఆకర్షితురాలై అనేక బాధ్యతలు నిర్వహించారు. మధురై నగరానికి చెందిన విల్లాపురం ప్రాంతంలో నగరపాలిక సభ్యురాలిగా ఎన్నికై ప్రజలకు విశేష సేవలందించారు. అలాంటి లీలావతి దారుణ హత్య వార్త విని తమిళనాడే ఉలిక్కిపడిందనడంలో అతిశయోక్తి లేదు. ఆమె హత్య ఒక చెదురు మదురు మాత్రమే కాదు. మహిళల రాజకీయ, సామాజిక ప్రజాతంత్ర హక్కుల మీదే ఘోరమైన దాడి. దుర్భర దారిద్య్ర జీవితంలోనూ త్యాగమయమైన జీవితం గడిపిన ఆమె గాధను ఈ చిన్ని పుస్తకం చరిత్ర పుటల్లో ఒక అధ్యాయంగా మారుస్తుందని నేను విశ్వసిస్తున్నాను.
Reviews
There are no reviews yet.