వేద సాహిత్యం – ఒక చారిత్రక పరిశీలన
₹25.00
పేజీలు : 32
భారత ఉపఖండంలో తొలిసారిగా తాత్విక చింతన ఆవిర్భావం, దాని వికాసం, భావవాద భౌతికవాద ధోరణులుగా విడిపోవటం, వాటి అభివృద్ధి గతి, ఈ పరస్పర విరుద్ధ ధోరణుల మధ్య నిరంతర ఘర్షణ మొదలైన వాటిగురించి తెలుసుకోవాలంటే వేద వాఙ్మయాన్ని క్షుణ్ణంగా అధ్యయనం చేయడం అవసరం. సర్వోత్కృష్టం, సర్వజ్ఞం, సర్వకామ్యార్థ ప్రసాదికంగా, ఆధ్యాత్మికులు ఆరాధించే వేద వాఙ్మయం మొత్తంగా రూపొందించడానికి, కొన్ని వందల సంవత్సరాల (సుమారు 1500 ఏళ్లు) కాలం పట్టింది. కాబట్టి ఇంత సుదీర్ఘ కాల వ్యవధిలో రూపొందిన వేద వాఙ్మయపు అభివృద్ధి గతిని గురించి తెలుసుకోవాలంటే ప్రాచీన భారతీయ చరిత్రలోని తొలి ఘట్టాల వరకు వెళ్ళాలి. వీటన్నింటికి సంబంధించిన సమగ్ర సమాచారం ఈ పుస్తకంలో లభిస్తుంది.
Reviews
There are no reviews yet.