పతనం అంచున భారత ఆర్థిక వ్యవస్థ

60.00

పేజీలు : 72
పెట్టుబడిదారీ ఆర్థిక సంక్షోభం ప్రపంచాన్ని చుట్టుముట్టింది. అన్ని ఖండాల్లోని పెట్టుబడిదారీ దేశాలన్నిటా ఆకలి కేకలు వినిపిస్తున్నాయి. నిరుద్యోగం ప్రబలింది. ఆర్థిక అసమానతలు పెరిగాయి. భారత దేశ పరిస్థితి దీనికి భిన్నంగా ఏమీ లేదు. ఆర్థిక సంక్షోభానికి తోడు కరోనా మహమ్మారి కాలంలో పెట్టుబడిదారీ ప్రభుత్వాలు అనుసరిస్తున్న నయా-ఉదారవాద విధానాలు శ్రామిక ప్రజల జీవనాన్ని మరింత దుర్భరం చేస్తున్నాయి. 1980వ దశకంలో అట్టహాసంగా ప్రకటించిన నయా-ఉదారవాద విధానాలు పెట్టుబడిదారీ వ్యవస్థలోని అన్ని సమస్యలకూ సర్వరోగనివారిణిగా ప్రచారం చేసుకున్నారు. కానీ మూడు దశాబ్దాలు గడిచేసరికి ఆ విధానాల డొల్లతనం ప్రస్తుత ఆర్థిక సంక్షోభ రూపంలో బయటపడింది.

Description

– ప్రభాత్‌ పట్నాయక్‌

వెల : 60/-